Take a fresh look at your lifestyle.

కరీంనగర్ కార్పొరేషన్‌పై కాంగ్రెస్ జెండా ఎగరాలి.. జోడెద్దుల్లా పనిచేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కాంగ్రెస్ గెలుపునకు వెలిచాల.. సంతోష్ కుమార్ జోడెడ్ల లాగా పని చేయాలి..

నాయకులు కార్యకర్తలకు దిశ నిర్దేశం చేస్తూ ముందుకు సాగండి..

కరీంనగర్ కార్పొరేషన్ పై
కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే..

కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తుమ్మల నాగేశ్వరరావు తో భేటీ అయిన మాజీ ఎమ్మెల్సీ టి సంతోష్ కుమార్..

కరీంనగర్ నగర పాలక సంస్థ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా అసెంబ్లీ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్రావు మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ జోడెద్దుల్లాగా పనిచేయాలని కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

కరీంనగర్లో ఆదివారం మంత్రి తుమ్మల, అసెంబ్లీ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు ఆహ్వానం మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో సంతోష్ కుమార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సంతోష్ కుమార్ సత్కరించారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో తాజా రాజకీయ పరిస్థితులపై మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై మంత్రికి సంతోష్ కుమార్ పలు సూచనలు చేశారు. అన్నింటినీ సావధానంగా విన్న మంత్రి కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని పేర్కొన్నారు. సీనియర్ నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని సంతోష్ కుమార్ కు మంత్రి సూచించారు. అన్ని డివిజన్లో అభ్యర్థులు ఘనవిజయం సాధించేలా నాయకులు కలిసికట్టుగా కృషి చేయాలని పేర్కొన్నారు. డిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ గా పని చేసిన అనుభవం ఉన్న దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు కృషి చేయాలని మంత్రి సూచించారు. మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఇన్చార్జి మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. అందుకు కష్టపడి పని చేస్తానని మంత్రికి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.