ముద్ర ప్రతినిధి, ఆదిలాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ లోని ప్రభుత్వ రాయితీ బియ్యాన్ని అక్రమంగా పేదలకు అధిక ధరలకు అమ్ముతున్న ఇద్దరిపైఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఇద్దరిని రిమాండ్కు పంపడం జరిగిందని నార్నూర్ సిఐ పి ప్రభాకర్ తెలియజేశారు. గాదిగూడ మండల కేంద్రంలో కూర శివాజీ కిరాణా షాప్ నందు యజమాని కూర శివాజీ వద్ద 17.6 క్వింటల్లా ప్రభుత్వ రాయితీ బియ్యం లభించిందని, చట్ట వ్యతిరేకంగా అమ్ముతున్న కారణంగా అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు.అదేవిధంగా లోకారి కే గ్రామం నందు షేక్ జావిద్ కిరాణా షాప్ నందు యజమాని షేక్ జావిద్ వద్ద తనిఖీ చేయగా 7.3 క్వింటల్లా ప్రభుత్వ రాయితీ బియ్యం లభించిందని తెలిపారు. వీరి ఇరువురిపై వేరువేరుగా గాదిగూడ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయబడ్డట్టు తెలిపారు వీరిద్దరిని ఈరోజు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపడం జరిగిందని తెలిపారు. ప్రజలు ఎవరైనా రాయితీ బియ్యం తరలిస్తున్న నిలువ ఉన్న సమాచారాన్ని మెసేజ్ యువర్ ఎస్పి కార్యక్రమం ద్వారా ప్రారంభించిన 8712659973 నెంబర్ కు వాట్సప్ ద్వారా మెసేజ్ చేసి సమాచారం అందించగలరని తెలిపారు.
