- మాజీ మంత్రి జీవన్ రెడ్డి.
- జగిత్యాలలో కాంగ్రెస్ సంబురాలు.
ముద్ర, జగిత్యాల టౌన్: తెలంగాణ ప్రభుత్వం బీసీ లకు 42% రిజర్వేషన్ అమలు చేయాలననే ఘనత కాంగ్రెస్ పార్టీదే నని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.బీసీ లకు 42% రిజర్వేషన్ ల పై సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశంలో నిర్ణయించడం పై హర్షం వ్యక్తం చేస్తూ, జగిత్యాలలో మాజీమంత్రి జీవన్ రెడ్డి ఆద్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, బీసీ నాయకులు శుక్రవారం సంబురాలు నిర్వహించారు. స్థానిక ఇందిరాభవన్ నుంచి తహసీల్ చౌరస్తా వరకు కాంగ్రెస్ జెండాలు పట్టుకొని, నినాదాలు చేస్తూ ర్యాలీ గా తరలివెళ్ళి స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక న్యాయం తోనే అభివృద్ధి సాధ్యమని, బలహీన వర్గాల హక్కుల సాధన కోసం బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని,ఎన్నికల ప్రణాళిక లో కామారెడ్డి డిక్లరేషన్ లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ తెర పైకి తీసుకు వచ్చామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కుల గణన చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చేసేందుకు రాష్ట్ర శాసన సభలో తీర్మానం చేసి ఆమోదించడంతోపాటు శాసన మండలి లో ఆమోదం చేసి కేంద్రానికి పంపినారు. బలహీన వర్గాల ప్రజలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి నివేదించారనీ, బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు 9 వ షెడ్యూల్ లో చేర్చాల్సిన బాధ్యత కేంద్రం పై ఉండగా, చలనం లేదన్నారు. ఏ బిల్లు పై అయినా మూడు నెలల్లోపూ నిర్ణయం చెప్పాలనీ సుప్రీమ్ కోర్టు తీర్పు చెప్పిన నేటికి కేంద్ర ప్రభుత్వం తన వైఖరి ప్రకటించలేదన్నారు. చట్టపరంగా బలహీన వర్గాల జనాభా పరంగా హక్కులు కల్పించేలా కృషి చేయాలి. బీసీ రిజర్వేషన్ పెంపు పై భారత సమాజం హర్షం వ్యక్తం చేస్తుంది. రాహుల్ గాంధీ ఆలోచన విధానం బలహీన వర్గాల ప్రజలకు హక్కులు కల్పించేలా ఎన్ని కుట్రలు చేసినా రిజర్వేషన్ అమలు ఆగేది లేదు అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం జగిత్యాల మండల పరిషత్ అధ్యక్ష పదవి బలహీన వర్గాలకు కేటాయించినా చట్టంలోని సాంకేతిక లోపాలు సవరించలేదు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, చట్టంలో మార్పులు చేసి, బలహీన పార్టీ హక్కులు కాపాడామని స్పష్టం చేశారు. ఇందులో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
