ముద్ర, యాదగిరిగుట్ట :
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్ధానం పునర్నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన భూనిర్వాసితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, డైరెక్టర్ హనుమంతరావులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధికి మా భూములు ఇచ్చి సహకరించామని, కానీ దేవాదాయ శాఖ అధికారులు, రాజకీయ నాయకులు కొండపైన వర్తకులకు అనుకూలంగా మాట్లాడుతున్నారని అన్నారు. అధిక ధరలకు వస్తువులను అమ్మి భక్తులను దోపిడీ చేస్తున్న విషయము అన్ని రాజకీయ పార్టీలకు తెలుసని, దీన్ని దృష్టిలో పెట్టుకొని కొండపైన వర్తక సంఘం దుకాణాలకు వేలం వేయాలని వర్తక సంఘం అధ్యక్షుడిగా కర్రె వెంకటయ్య గతంలో డిమాండ్ చేశారు. ప్రస్తుతం మాట మార్చి వర్తకుల కడుపు కొట్టడం సరికాదని ఆయన వాఖ్యానిస్తున్నారు. కోట్లకు పడగలెత్తిన వర్తకులకు వత్తాసు పలకడం సరైనది కాదని తెలిపారు. దేవస్థానం ఆదాయానికి ఏడాదికి సుమారు రూ.30 కోట్లు నష్టపరిచే వర్తకులకు మద్దతు తెలపడం అన్యాయమని పేర్నొన్నారు. కొండకు ఉత్తర దిక్కులో గండిచెరువు నుండి ఊరకుంట చెరువు వరకు 93.03 ఎకరాల భూములను స్వచ్ఛందంగా ఎలాంటి షరతులు విధించకుండా ఇచ్చామని అయినప్పటికీ రైతులకు ఎలాంటి దుకాణాలు లేవని అన్నారు. మేము ఇచ్చిన భూముల్లోనే వర్తకులకు దుకాణ సముదాయాలు కట్టించారని, ఆలయ అభివృద్ధిలో భాగంగా వర్తకులు ఎలాంటి ఆర్థిక, ఆస్తి నష్టం జరగకపోయినా కానీ, మాజీ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తాత ముత్తాతల నుంచి సంక్రమించిన వందల ఏళ్లనాటి భూములను రైతులు జీవనోపాధిని కోల్పోయి అప్పగించి ప్రభుత్వానికి అండగా నిలబడ్డట్లు తెలిపారు. రైతు కుటుంబాలతో పాటు నిరుద్యోగ యువత కూడా ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్తున్నారు. అయినప్పటికీ స్థానికులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. ఉపాధి కోసం న్యాయం జరగాలని రైతులు, నిరుద్యోగులం నిస్వార్థ పోరాటం చేస్తున్నాం. దేవస్థానం ఉన్నతధికారులుగా తమరు ఇప్పటికైనా నష్టాన్ని గుర్తించి వర్తక సంఘంలోని దుకాణాలకు టెండర్ నిర్వహించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భూనిర్వాసితులు బూడిద సురేందర్, బూడిద నాగరాజు, బూడిద దేవమ్మ, బూడిద పద్మ, బూడిద నరసింహ, బూడిద సాయికృష్ణ పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.