Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలు సమర్థవంతంగా అందించాలి:జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు వైద్యులు,సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు.
మంగళవారం నారాయణఖేడ్ పట్టణంలోని బస్తీ దవాఖాన, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, శెట్కార్ గ్రౌండ్స్,ప్రభుత్వ ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహాన్ని కలెక్టర్ నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈసందర్భంగా ఆసుపత్రిలోని ప్రతి విభాగాన్ని పరిశీలించిన కలెక్టర్, అక్కడ విధులు నిర్వహిస్తున్న వైద్యులు మరియు సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజూ ఓపీకి వచ్చే రోగుల వివరాలపై ఓపీ రిజిస్టర్‌ను పరిశీలించారు.ఆసుపత్రికి వచ్చిన రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్యులు,సిబ్బంది సమయానికి అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారా అన్న విషయాన్ని రోగులను అడిగి తెలుసుకున్నారు.


ఫార్మసీ గదిలో మందుల స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించి అవసరమైన అన్ని ఔషధాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ఆసుపత్రినీ,పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఆదేశించారు.అనంతరం నారాయణఖేడ్‌
లోని శెట్కార్ గ్రౌండ్స్‌ను సందర్శించి పరిశీలించారు. ఇండోర్ స్టేడియం నిర్మాణనికి మరియు అవసరమైన మరమ్మత్తులకు అంచనా ప్రతిపాదనలు సిద్ధం చేసి అందించాలని ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. స్టేడియం వినియోగానికి డైలీ రెంట్‌ను నిర్ణయించాలని, స్టేడియం పరిధిలో ఉన్న షాపుల రెంట్ బకాయిలను వసూలు చేయాలని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ అఖిలేష్ రెడ్డికి ఆదేశించారు.
తదనంతరం ప్రభుత్వ ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహాన్ని సందర్శించి పరిశీలించారు.హాస్టల్‌లో ఉన్న రూఫ్ లీకేజీ,డ్రైనేజీ తదితర మరమ్మత్తులకు అవసరమైన అంచనా ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలని ఈడబ్ల్యూఐడీసీ
ఏఈకి ఆదేశించారు.
ఈతనిఖీల్లో కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ ఉమా
హారతి,సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ అఖిలేష్ రెడ్డి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ అవినాష్ నాయక్,తహసిల్దార్ తదితరు లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.