Take a fresh look at your lifestyle.

బండచెరువు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి -ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

 

ముద్ర : మల్కాజిగిరి

మల్కాజిగిరి నియోజకవర్గంలోని బండచెరువును పరిరక్షిస్తూ ఆధునికరించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు.
సోమవారం బుద్ధ భవన్‌లో హైడ్రా కమిషనర్ ఎ .వి.రంగనాథ్ ని మర్యాదపూర్వకంగా కలిసి బండచెరువు సమస్యలపై ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు.
చెరువులో ప్రస్తుతం పేరుకుపోయిన గుర్రపు డెక్క ,చెత్త, మట్టిపొరలు కారణంగా చెరువు పర్యావరణం దెబ్బతింటోందని, దీని వల్ల స్థానిక ప్రజలకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయని ఎమ్మెల్యే కమిషనర్ కి వివరించారు. చెరువులోని గుర్రపు డెక్కను తొలగించి, చెరువును పరిరక్షిస్తూ ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని కోరారు.
ఎమ్మెల్యే సమర్పించిన వినతిపత్రంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మల్కాజిగిరి నియోజకవర్గంలోని చెరువులు, పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం తాను నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.