Take a fresh look at your lifestyle.

స్ట్రీట్ ఫుడ్ వెండర్స్‌కు శిక్షణ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ పట్టణంలోని స్ట్రీట్ ఫుడ్ వెండర్స్‌కు పరిశుభ్రత మరియు నాణ్యత ప్రమాణాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. ఈ నెల 28, 29, 30 తేదీలలో పట్టణంలోని హిమాలయ హోటల్‌లో ఈ కార్యక్రమం నిర్వహించబడనుంది.


రోడ్డుపై టిఫిన్ బండ్లు, జ్యూస్ బండ్లు మరియు ఇతర తినుబండారాలు విక్రయించే ఫుడ్ వెండర్స్‌కు ఈ శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. నాశ్వి ఆర్గనైజేషన్ మరియు నెస్లే సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు.
ప్రతి రోజు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు శిక్షణ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే స్ట్రీట్ ఫుడ్ వెండర్స్‌కు హైజెనిక్ కిట్‌తో పాటు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) సర్టిఫికెట్ అందజేయబడుతుందని పేర్కొన్నారు.
అందువల్ల పట్టణంలోని స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని శిక్షణలో పాల్గొనాలని కమిషనర్ కోరారు.

Leave A Reply

Your email address will not be published.