Take a fresh look at your lifestyle.

గుండెపోటుతో మాజీ సర్పంచ్‌ మృతి

మల్యాల, ముద్ర : మండలంలోని ముత్యంపేట (కొండగట్టు) గ్రామ మాజీ సర్పంచ్‌ మల్యాల పోచయ్య (56) బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల గ్రామ ప్రజలు తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. సర్పంచ్‌గా 2001 సంవత్సరం నుంచి 2006 సంవత్సరం వరకు పని చేసి ప్రజల మన్ననాలను పొందారు. మాజీ సర్పంచ్‌ పోషయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృతిపట్ల స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు సంతాపం తెలిపారు. ఆయన వెంట దారం ఆది రెడ్డి, బత్తిని శ్రీనివాస్, ముత్యం శంకర్, మ్యాక లక్ష్మణ్, బాలే శ్రీనివాస్, కొండబత్తిని అనిల్, దూస వెంకన్న, తాళ్ల హరినాథ్, మర్రి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.