- కాంగ్రెస్ చిత్త శుద్ధి నిరూపించుకోవాలి.
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు సవాల్.
ముద్ర ప్రతినిధి, మెదక్: కాంగ్రెస్ పార్టీ మాటలు కాదు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డితో రాజీనామా చేయించి బీసీని సీఎం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు సవాల్ విసిరారు. 10 శాతం ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తే నష్టపోయేది బీసీలేనని పేర్కొన్నారు.42 శాతం రిజర్వేషన్ కు బిజెపి అనుకూలమే అన్నారు.బీజేపీ సపోర్ట్ చేయడం లేదని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. 2028 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బాధ్యతలు చేపట్టాక మొదటిసారిగా శుక్రవారం మెదక్ జిల్లాలో పర్యటించారు. మెదక్ సాయి బాలాజీ గార్డెన్స్ లో నిర్వహించిన కార్యకర్తల సమ్మేళనం జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేశం గౌడ్ అధ్యక్షతన జరగ్గా ఎంపి రఘునందన్ రావు, ఎమ్మెల్సీ డా. అంజిరెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మహేందర్, రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గోదావరి, శంకర్, జిల్లా మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ పాల్గొన్నారు.రాంచందర్ రావు మాట్లాడుతూ.. ప్రధాని సహా కేంద్ర క్యాబినెట్ లో 20 మందికిపైగా బీసీలు ఉన్నారు. గతంలో బీసీ కమిషన్ లేదు భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిందని గుర్తు చేశారు.కాంగ్రెస్ పాలనలో దేశాన్ని దోచుకుందని ఆయన ద్వజమెత్తారు. భారతీయ జనతా పార్టీ అవినీతి రహిత పార్టీ అన్నారు.వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తిప్పి కొట్టాలన్నారు.స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో బిజెపి కార్యకర్తలను గెలిపించే బాధ్యత నాది,ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీలదేనన్నారు. బీజేపీ ఒక్కప్పుడు పట్టణాలలో మాత్రమే ఉండేది, నేడు గ్రామీణ ప్రాంతంలో కూడా విస్తరించిందన్నారు. రాష్ట్రంలో 40 లక్షల సభ్యత్వం ఉందని తెలిపారు. మెదక్ జిల్లాలో గతంలో ఆలె నరేంద్ర, రఘునందన్ రావు ఇతర చైర్మన్ లను కైవసం చేసుకుందని గుర్తు చేశారు.ఈ ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వం, ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గురించి చిత్తశుద్ధి ఉంటే నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు.జాతీయ రహదారులు, ఇతర కార్యక్రమాల కోసం 12 లక్షల కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు.కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీకి త్వరలో శంఖుస్థాపన చేస్తారు. కొత్త రహదారులు, రైల్వే స్టేషన్లు ఇవ్వడం జరిగిందన్నారు. అమలుకాని హామీలు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చింది.ఆరు గ్యారంటీలు రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు.రైతుబంధు బంద్ అయింది.రుణమాఫీ చేయడం లేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు.అభివృద్ధి కార్యక్రమాలకు ఆగిపోయాయని రాంచందర్ రావు విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ పరిపాలన పక్కన పెట్టింది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలుపరచలేకపోతున్నారు.ప్రజలను మోసం చేస్తున్నారని ద్వజమెత్తారు.మెదక్ జిల్లాలో మంజీరా, సింగూర్ నీళ్లు ఇవ్వాలని రైతులు అడుగుతున్నారు.మల్లన్న సాగర్ కోసం భూములు తీసుకున్న రైతులకు డబ్బులు ఇవ్వలేదు.రాష్ట్రంలో బిజెపి వస్తే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది.ఉమ్మడి మెదక్ జిల్లా కూడా అభివృద్ధి మార్గంలో పోతుందన్నారు.అధికారం లోకి బీజేపీ ఖాయం 2028లో భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాల గురించి ప్రజలకు వివరించాలని కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు అవకాశం ఇచ్చారు.ఒక్క అవకాశం బీజేపీకి ఇవ్వాలని కోరారు. బీజేపీ ఉద్యమ బాట పట్టాలని, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలన్నారు.ఈ సమ్మేళనంలో ఏడుపాయల దర్శనం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు ఏడుపాయల వనదుర్గ మాతను దర్శించుకున్నారు.ఎంపీ రఘూనందన్ రావు, ఎమ్మెల్సీ డా. సి. అంజిరెడ్డి తో కలిసి రాగా రాజగోపురం వద్ద ఈవో చంద్రశేఖర్, ఆర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ మర్యాదలతో సత్కరించారు. నర్సాపూర్ లో జెందవిష్కరణమెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో బీజేపీ జెండాను రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు ఆవిష్కరించారు.మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నర్సాపూర్ పట్టణంలో ఘన స్వాగతం పలికారు.పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి తదితరులున్నారు. ఏడుపాయల నుండి మెదక్ వరకు ఓపెన్ టాప్ వాహనంలో ర్యాలీ నిర్వహించి గజమాలతో సత్కరించారు.
