Take a fresh look at your lifestyle.

పార్టీ సభ్యత్వంపై శ్రేణులు దృష్టి పెట్టాలి

  • టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, పోలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహ్ములు.

మొయినాబాద్, ముద్ర విలేకరి : తెలుగుదేశం పార్టీని తెలంగాణలో అభివృద్ధి చేయాలంటే ప్రధానమైనది సభ్యత్వం.ఈ విషయంలో పార్టీ శ్రేణులు దృష్టి పెట్టి అధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేయించాలని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి,టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహ్మలు సూచించారు.మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారంలో శుక్రవారం నిర్వహించిన పార్టీ సభ్యత్వ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గోన్నారు.అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు అందరూ కష్టపడి పనిచేయాలని సూచిం చారు.సభ్యత్వ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా పనిచేయాలని సూచించారు.పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పనిచేయాలని స్పష్టం చేశారు.సభ్యత్వాలు పెంచితేనే పార్టీ బలోపేతానికి అవకాశం ఉంటుందని దీనిని ప్రతి ఒక్కరూ గమనించాలని కూడా చెప్పారు.ఈకార్యక్రమంలో పార్టీ మాజీ ఎస్సీసెల్ ఉపాద్యక్షుడు కేతన్రావు, ప్రదాన కార్యదర్శి గూడెపు రాఘవులు, మండల పార్టీ అద్యక్షుడు ఎల్గని యాదయ్య గౌడ్ కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.