Take a fresh look at your lifestyle.

మెదక్ జిల్లాలో వడగళ్ల వర్షం

ముద్ర ప్రతినిధి, మెదక్:
అల్పపీడన ప్రభావంతో సోమవారం సాయంత్రం మెదక్ జిల్లాలో వడగళ్ల వర్షం కురిసింది. జిల్లా సరిహద్దు హవెలి ఘనపూర్ మండలం పోచమ్మరాల్, నాగపూర్, బూరుగుపల్లి గ్రామ శివార్లలో వడగళ్ల వాన పడింది. వడగళ్లు పడడంతో వరి పంటలు పొట్ట దశలో ఉన్న సమయంలో నష్టపోతాయని రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రానున్న రెండు మూడు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో, చేతికొచ్చే పంట దెబ్బతింటుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.