Take a fresh look at your lifestyle.

తమ్ముని మృతికి కారణమైన అన్న అరెస్టు

 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

తమ్ముని మృతికి కారణమైన అన్నను సిద్దిపేట టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు. సిద్దిపేట లొని బోయిగల్లి కి చెందిన వంగలి రాములు, వంగలి ప్రభు, వంగలి కొండలు సంబంధించిన పాత ఇల్లు అమ్మడానికి దరచేసుకున్నారు., వంగలి కొండలు మిగతా ఇద్దరు అన్నదమ్ములకు డబ్బులు చెల్లించాడని కాని ఇంటిని కొండాల పేరు మీద మార్చడానికి డబ్బులు తీసుకొని కూడా రాములు సంతకం చేయకుండా వేధింపులకు గురి చేశాడని తెలిపారు. వారి అమ్మమ్మకు చెందిన 60 గజాల భూమిని ఎవరికి తెలవకుండా వంగలి రాములు తన భార్య చంద్రకళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుని అడిగినందుకు కొండలును రాములు అతని భార్య చంద్రకళ తిట్టి అవమానించరని తెలిపారు. అవమానం భరించలేక ఈ నెల 15 వ తేదీన వంగలి కొండలు పురుగుల మందు తాగి అస్వస్థకు గురికావడంతో తన కుటుంబ సభ్యులు సిద్దిపేటలోని ప్రభుత్వాసుపత్రి తరలించి మెరుగైన చికిత్స గురించి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొండలు మరణించాడని తెలిపారు.మృతుని రెండవ అన్న వంగలి ప్రభు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్స్పెకర్ అఫ్ పోలీస్ టూ టౌన్ ఉపేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. , సోమవారం నిందితులు వంగలి రాములు అతని భార్య చంద్రకళను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని జరిగినదని టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.