Take a fresh look at your lifestyle.

​బాలానగర్‌లో రామ్ చరణ్ జన్మదిన వేడుకలు: రక్తదాన శిబిరాన్ని నిర్వాహించిన అభిమానులు

​ముద్ర కూకట్‌పల్లి : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 41వ పుట్టినరోజును పురస్కరించుకుని, మెగా అభిమానుల ఆధ్వర్యంలో బాలానగర్‌లోని మైత్రీ విమల్ థియేటర్ వద్ద భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ , సైబరాబాద్ మున్సిపల్ కో-ఆర్డినేటర్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒకరు చేసే రక్తదానం ముగ్గురి ప్రాణాలను కాపాడుతుందని పేర్కొన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు, రోడ్డు ప్రమాద బాధితులకు మరియు శస్త్రచికిత్సల సమయంలో రక్తం ఎంతో అవసరమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమ్ అని కొనియాడారు. ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ సామాజిక స్పృహతో ముందుకు వస్తున్న యువతను, నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు.
​ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు , పెద్ద సంఖ్యలో మెగా అభిమానులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.