- అలరించిన డ్రామా జూనియర్స్
ముద్ర ప్రతినిధి జడ్చర్ల: ఉదయం మెమోరియల్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు సూపర్లను ఆకట్టుకున్నాయి.మంగళవారం సాయంత్రం చంద్ర గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు వివిధ రకాల ఆటపాటలతో చూపర్లను ఎంతో ఆకట్టుకున్నారు.అందులో భాగంగా డ్రామా జూనియర్స్ కలను ప్రదర్శించిన చిన్నారులు సామాజిక అంశాలపై,ఉమ్మడి కుటుంబంలో తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి అని అంశంపై డ్రామా వేసి అందర్నీ మంత్రముగ్ధుల్ని చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బాదిమి వీణ,మాది సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాధిమి శివకుమార్, రవిశంకర్, ధ్రువ, సూరిశెట్టి పవన్, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు.
