Take a fresh look at your lifestyle.

వైభవంగా గుండు మల్లన్న స్వామి జాతర ఉత్సవాలు

గొల్లపల్లి,ముద్ర: జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలో గుండు మల్లన్న స్వామి జాతర ఉత్సవాలు వైభవంగా ఆలయ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో మూడు రోజుల ఉత్సవాలు నిర్వహించారు.ఆలయ అర్చకులు వేదమం త్రోచ్ఛరణల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు. అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి ఉత్సవ మూర్తుల శోభాయాత్ర ఆలయం నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల మీదుగా నిర్వహింస్తున్న ఉత్సవాలు చివరి రోజు భక్తులు ఒగ్గు పూజారుల సమక్షంలో స్వామి వారికి పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు బెల్లం పానకంతో వండిన బోనాలను నెత్తిన ఎత్తుకుని ఒగ్గు పూజారుల ఢమరుక నాధాల నడుమ ఆలయం వద్దకు ఊరేగింపుగా తరలి వచ్చి. బోనాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామి వారికి బోనాలు సమర్పించారు.అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఎడ్లబండ్ల పోటీలు కార్యక్రమంలో పోటీలో గెలుపొందిన వారికి బహుమతి అందజేశారు.స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు విప్ లక్ష్మణ్ కుమార్ శాలువాతో సన్మానించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.అనంతరం రైతు పరస్పర సహాయ సహకార సంఘ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఉస్కమాల్ల లచ్చయ్య,కాంగ్రేస్ పార్టీ మండల అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి, ఏఎంసి భీమా సంతోష్, చిర్ర గంగాధర్,తిరుపతి రెడ్డి,గురజాల బుచ్చిరెడ్డి,క్యాస గంగాధర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.