Take a fresh look at your lifestyle.

సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించి పరిశీలించిన ఎమ్మెల్యే

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సోమవారం రామగుండం సామాజిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆకస్మాత్తుగా సందర్శించి,పాఠశాలలో ఉన్న వసతులను స్వయంగా పరిశీలించారు.విద్యార్థుల జీవన నిబద్ధత,ఆహార వసతి,తరగతుల నిర్వహణ, హాస్టల్ పరిపాలన తదితర అంశాలపై నేరుగా విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నారు.విద్యార్థుల అభిప్రాయాలను బట్టి విద్యా ప్రమాణాలు మెరుగుపడా లనే దృష్టితో విద్యార్థులకు అందుతున్న భోజనం నాణ్యతను పరీక్షించి,హాస్టల్ గదులు,మరుగు దొడ్లు,నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలపై అధికారులు ఎంతవరకు శ్రద్ధ వహిస్తున్నారన్న విషయాన్ని ఆయన సమీక్షించారు.ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ “ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులు మంచి వాతావరణంలో చదువు కోవడం అనేది అత్యంతఅవసరం. వసతుల లోపం వల్ల విద్యార్ధుల భవిష్యత్ దెబ్బతినకూడదు. అందుకే ఇలా అకస్మాత్తుగా వచ్చి మౌలిక సదుపాయాలు పరిశీలించా.ఏ లోపాలైనా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటా” అని హామీ ఇచ్చారు.అలాగే,విద్యార్థులు నిస్సంకోచంగా తమ సమస్యలను వెల్లడించగలిగేలా ఒక శ్రవణ విధానం ఏర్పాటు చేయాలన్న సూచనలను సంబంధిత అధికారులకు ఇచ్చారు.ఈ సందర్శనలో ఎమ్మెల్యే తో పాటు స్థానిక అధికారులు,పాఠశాల సిబ్బంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.