Take a fresh look at your lifestyle.

రోడ్డు ప్రమాదంలో కొండాపురం వాసి మృతి

 

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి:‌

ధరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. కొండాపురం గ్రామానికి చెందిన సింహాద్రి (52) అనే వ్యక్తి రాత్రి జాంపల్లి గ్రామ శివారులోని తాయమ్మ మిట్ట వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు.
​ఆ సమయంలో వేగంగా వచ్చిన ఒక గుర్తు తెలియని వాహనం ఆయనను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సింహాద్రికి తీవ్ర గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతునికి భార్యతో పాటు కుమారుడు, కూతురు ఉన్నారు. కాగ సింహాద్రి రాత్రి కుటుంబసభ్యులతో కొట్లాడి ఇంటి నుంచి బయటకు వెళ్లాడని, కొండాపురం నుంచి‌ గద్వాలకు నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.