ముద్ర ప్రతినిధి, మెదక్:
జనగణన – 2027ను సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లు బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని జనగణ డైరెక్టర్ భారతి హొళ్లికేరీ అన్నారు.మంగళవారం మెదక్ మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ప్రతిమా సింగ్, జనగణ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు.
జనగణన -2027లో భాగంగా హౌస్ లిస్టింగ్ బ్లాక్స్, సెన్సస్ మానిటరింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, డిజిటల్ విధానం, స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) పై సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లకు
జన గణనకు సంబంధించిన కిట్లను సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లకు పంపిణీ చేశారు. మొదటి దశలో మే 11 నుంచి జూన్ 9 వరకు ఇండ్ల గణన నిర్వహిస్తారని, రెండో దశ ఫిబ్రవరి 2027లో వ్యక్తుల వారిగా సమాచారం సేకరిస్తారని అధికారులు తెలిపారు. ప్రతి కుటుంబం వివరాలు పక్కాగా సేకరించి.. నమోదు చేయాలని ఆదేశించారు. అందరి వివరాలు గోప్యంగా ఉంచాలని స్పష్టం చేశారు.
ఎండాకాలం నేపథ్యంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నీటి బాటిల్ వెంట తీసుకువెళ్లాలని సూచించారు. ఈ నెల 26న స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా చేసుకోవాలని ఆదేశించారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని బాధ్యతల నిర్వహణలో ఎంతో కీలకమని స్పష్టం చేశారు. వివరాలు పక్కాగా సేకరించి నమోదు చేయాలని ఆదేశించారు. వెంట కలెక్టర్ ప్రతిమా సింగ్, ఆర్డిఓ రమాదేవి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Prabhakar is a sub Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.