మహమ్మద్ ప్రవక్త బోధనలు చాలా విలువైనవని మరియు మానవ శ్రేయస్సుకై ఉపకరిస్తాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు “అల్ఫోర్స్” నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కరీంనగర్లోని కరీంనగర్ ఫంక్షన్ ప్యాలెస్ లో పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసినటువంటి ఇఫ్తార్ విందుకు సుఢా చైర్మన్ శ్రీ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా హాజరై వారు మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు చేసేటువంటి కఠినమైన ఉపవాస దీక్ష చాలా సత్ఫలితాలు ఇవ్వడమే కాకుండా వారి యొక్క జీవితంలో విజయాలు అందిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని వాళ్ళు చెప్పారు. నరేందర్ రెడ్డి గారు చేసేటువంటి సేవలు స్ఫూర్తిదాయకమని వారు కొనియాడారు.

“అల్ఫోర్స్” నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ విఎన్ఆర్ ఫౌండేషన్ ఆరంభం నాటి నుండి ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని మరియు ప్రవక్త యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని మరియు సమాజ శ్రేయస్సుకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ శాంతికి ప్రతీక అయిన రంజాన్ పండుగను ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకోవాలని చెప్పారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ కుమార్ గారు, పలువురు ముస్లిం మత పెద్దలు, మైనార్టీ కార్పోరేటర్లు పాల్గొన్నారు.