ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన నేషనల్ లోక్ అదాలత్ అత్యంత విజయవంతమైందని, గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలోని అన్ని సబ్-డివిజన్ల పరిధిలో పోలీసులు, న్యాయశాఖ సమన్వయంతో పనిచేయడం వల్ల ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని ఆమె కొనియాడారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా మొత్తం 3195 కేసులు పరిష్కారం కావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా 441 ఎఫ్ ఐ ఆర్ కేసులు, 2694 డీడీ కేసులు, మరియు 60 ఈ-పెట్టి కేసులు పరిష్కరించబడ్డాయని వివరించారు. ఈ లోక్ అదాలత్ ద్వారా కక్షిదారుల మధ్య రాజీ కుదిర్చి, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని, తద్వారా సామాన్య ప్రజలకు సమయం మరియు ఖర్చు ఆదా అయ్యాయని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. సబ్-డివిజన్ల వారీగా చూస్తే, తాండూరు సబ్-డివిజన్ అత్యధికంగా 1686 కేసులను పరిష్కరించి ప్రథమ స్థానంలో నిలవగా, పరిగి సబ్-డివిజన్ 846 కేసులు, వికారాబాద్ సబ్-డివిజన్ 631 కేసులను పరిష్కరించాయని ఎస్పీ గణాంకాలను వివరించారు. ఒక్క రోజే జిల్లా వ్యాప్తంగా 157 ఎ ఎఫ్ ఐ ఆర్ కేసులను పరిష్కరించి లక్ష్యానికి మించి ఫలితాలను సాధించామని ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు.
భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి, జిల్లాలో పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించి ప్రజలకు వేగవంతమైన న్యాయం అందించాలని అధికారులను కోరారు. చట్టపరమైన చిక్కుల నుంచి ప్రజలు విముక్తి పొందేందుకు లోక్ అదాలత్ ఒక మంచి వేదిక అని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ స్నేహ మెహ్రా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఇంతటి భారీ స్థాయిలో కేసుల పరిష్కారానికి కృషి చేసిన అదనపు ఎస్పీ బి. రాములు నాయక్, డీసీఆర్ బి డీఎస్పీ జానయ్య, వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, తాండూర్ డీఎస్పీ ఎన్. యాదయ్య, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, జిల్లా లోని సీఐలు, ఎస్ఐలు మరియు ఇతర పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Prev Post