ముద్ర, కోరుట్ల;
కోరుట్లలో గడిబురుజుల (గ్రామకంఠ / ఆబాది) ఖాళీ స్థలాల పరిరక్షణ కోసం అఖిలపక్ష ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష రెండవ రోజు కొనసాగింది. ఈ భూములపై విధించిన వీఎల్టీ లను వెంటనే రద్దు చేయాలని, అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుదవారం రోజు దీక్షకు బిఆర్ఎస్ కౌన్సిలర్లు ఎండి. మోసిన్, పొట్ట సురేందర్, ఎండి. ముజఫర్ అహ్మద్ సజ్జు, సయ్యిద్ ఆన్వర్ లు సంఘీభావం తెలపడమే కాకుండా, ఉద్యమంలో నేరుగా పాల్గొంటామని, అధికారపక్షం కాంగ్రెస్ పార్టీ గడి స్థలాల విషయంలో గొంతు ఎత్తుకపోవడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఇకనైనా స్పందించి విఎల్టీలు రద్దు చేయాలని కోరారు. అంతకుముందు బిజేపి నాయకులు కూడా మద్దతు తెలిపారు. దీంతో ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ప్రజాసంఘాల కో కన్వీనర్ లు తుమ్మనపల్లి శ్రీనివాస్ బాబు, సుతారి రాములు, సయ్యద్ అన్వర్, తదితరులు పాల్గొన్నారు.