Take a fresh look at your lifestyle.

సంపూర్ణ ఆరోగ్యానికి మానసిక ప్రశాంతతకు యోగ ఎంతో అవసరం. -ఈషా ఫౌండేషన్ ప్రతినిధి పి శంకరయ్య.

ముద్ర, మోత్కూర్:
సంపూర్ణ ఆరోగ్యానికి , మానసిక ప్రశాంతతకు యోగా ఎంతో ఉత్తమమైన మార్గమని ఈషా ఫౌండేషన్ ప్రతినిధి, అడ్డగూడూరు ఎంపీడీవో పి శంకరయ్య అన్నారు. బుధవారం
మోత్కూరు లో సద్గురు ఈషా ఫౌండేషన్ , రెడ్ క్రాస్ యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ, మోత్కూరు మండల శాఖ ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ, అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇట్టి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ యోగా ధ్యానం ద్వారా సద్గురు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తున్నారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వాలంటీర్లతో ఈషా ఫౌండేషన్ ఎటువంటి లాభా పేక్ష లేకుండా యోగ కార్యక్రమాలు నిర్వహిస్తుందని వివరించారు. ఇన్నర్ ఇంజనీరింగ్ వంటి కార్యక్రమాల ద్వారా వ్యక్తిగత వికాసాన్ని ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఈషా వాలంటీర్లు డి స్రవంతి, నరేష్, శివ, నవీన్ ,శృతి ,గోపి సింగ్ ,స్వాతి,రెడ్ క్రాస్ మోత్కూరు మండల శాఖ అధ్యక్షుడు ఓ సత్యనాద్ ,ఉపాధ్యక్షుడు ముప్ప వెంకటరెడ్డి, కోశాధికారి బుస్స రవి, జిల్లా డైరెక్టర్లు ఎస్ ఎన్ చారి, పన్నాల శ్రీనివాసరెడ్డి, అనిల్ చేపూరి, ప్రసాద్ , బిజెపి జిల్లా కోశాధికారి జి సోమ నర్సయ్య, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మొగుళ్ళపల్లి సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.