ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: సింగరేణి సంస్థకు నూతన డైరెక్టర్ (పా)పిఏ అండ్ డబ్ల్యు గా ఇటివల భాద్యతలు స్వీకరించిన గౌతం పొట్రూ ఆర్.జి 1 ఏరియాకు మొదటి సారిగా విచ్చేసిన సందర్భంగా మంగళవారం సింగరేణి ఏరియా హాస్పిటల్ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.హాస్పిటల్ లో అవుట్ పెషంట్స్, ఇన్ పెషంట్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.హాస్పిటల్ లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. సింగరేణి ఏరియా హాస్పిటల్ లో గుండెకు సంబంధించిన క్యాత్ లాబ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.హాస్పిటల్ మొత్తం వార్డులు తిరిగి తనిఖీ చేశారు.హాస్పిటల్లో జనరల్ సర్జన్, ఇ.ఎన్.టి డాక్టర్ల కొరతఉన్నందున త్వరగా నియమిస్తామని తెలిపారు.అలాగే సింగరేణి హాస్పటల్ లో ఉన్నటువంటి ఆర్థోసర్జన్స్ చాలా బాగా ఆపరేషన్ చేస్తున్నందున ఆర్తో సంబందించిన కేసులు ఇక్కడే చేయాలని ఆయన చెప్పారు.ఆర్జీ.1 ఏరియా జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ ఆధ్వర్యంలో ఏరియా హాస్పిటల్ లో ఏసీఎంవో డాక్టర్ అంబికా డైరెక్టర్ పా ని శాలువాతో సన్మానించి పులా బోకే అందజేశారు.ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, డిజియం సివిల్ వరప్రసాద్, డీజీఎం వర్క్ షాప్ జితేందర్ సింగ్,సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి,హాస్పటల్ సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శ్రీనివాస్,పి ఓ ఏ బి మురళి హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు.