- ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, కల్వకుర్తి: కంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేయించుకోవాలని ఎలాంటి నిర్లక్ష్యం వహించినా పూర్తిగా చూపు పోయే అవకాశం ఉంటుందని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సి ఓ ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. కల్వకుర్తి పట్టణంలో ఐక్యత ఫౌండేషన్, శంకర నేత్రాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరం నాలుగో రోజు విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆయన శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు.మనిషి శరీరంలో కళ్ళు చాలా ముఖ్యమైన అంశం అని, వాటిని నిర్లక్ష్యం చేయొద్దని అన్నారు. ఎలాంటి కంటి సమస్య ఉన్నా పరిష్కారం చూపెదిశగా కంటి వైద్య శిభిరం సేవలు కొనసాగుతున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.గత నాలుగు రోజుల నుండి దాదాపు 3000 మందికి పైగా శిబిరాన్ని సందర్శిచారని,2200 మందికి కంటి పరీక్షలు నిర్వహించండం జరిగిందన్నారు. వీరిలో 120 మందికి పైగా పేషెంట్లను కంటి శుక్లాల ఆపరేషన్లు ఎంపిక చేయడం జరిగిందని, 1300 మందికిపైగా ఉచితంగాకంటి అద్దాలు పంపిణీ చేశామని తెలిపారు. ఆదివారం వరకు కొనసాగనున్న ఉచిత కంటి శిభిరం సేవలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు నరేందర్ గౌడ్, యూసఫ్ బాబా, గణేష్, యాదయ్య, రమేష్ నాయక్, శేఖర్, రాఘవేందర్, శ్రీపతి, శ్రీను, నాగిళ్ల శివ, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.