Take a fresh look at your lifestyle.

పోలింగ్ ప్రశాంతం

ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
………………………………………
మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ని 60 డివిజన్ల లో బుధవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎస్పీ జానకి, ఇతర ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించారు. ఓటర్లు నిర్భయంగా ఓటు వేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలతో ముగిసింది.5 గంటలలోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు.
ఎన్నికలకు సంబంధించిన ఓట్లు ఈ నెల 13న లెక్కించనున్నారు. పాలమూరు లో ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, కాంగ్రెస్ ఢిల్లీ అధికార ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి,బీజేపీ నుంచి ఎంపీ డీకే అరుణ,బీ ఆర్ ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇతర నేతలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.