ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:
నాగర్‌కర్నూల్ జిల్లాలో బిజినపల్లి, నాగర్‌కర్నూల్, తాడూరు, తిమ్మాజిపేట మండలాలలో నూతనంగా ఎన్నికైన సర్పంచులను క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సుమారు 120 మందికి పైగా సర్పంచులు పాల్గొన్నారు.

బిజినపల్లి మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో క్లాస్మేట్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు నాగం చంద్రమోహన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు గాడి సురేందర్ మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైన సర్పంచులు తమ గ్రామాల అభివృద్ధికి కృషి చేసి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని సూచించారు.
నాగర్‌కర్నూల్‌లో జరిగిన కార్యక్రమంలో క్లాస్మేట్ వ్యవస్థాపక అధ్యక్షుడు వాస రాఘవేందర్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం 365 రోజులు – 365 కార్యక్రమాల లక్ష్యంతో ప్రతి గురువారం నాగర్‌కర్నూల్ డివిజన్‌లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సర్పంచులు సహకరిస్తే ప్రతి గ్రామంలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.
తిమ్మాజిపేట మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో డీఈఓ రమేష్ కుమార్ మాట్లాడుతూ, క్లాస్మేట్ క్లబ్‌తో పాటు నూతన సర్పంచులు కూడా జిల్లాలో విద్యా అభివృద్ధికి తోడ్పాటు అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు వాస రాఘవేందర్, జిల్లా అధ్యక్షుడు నాగం చంద్రమోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమణ, జిల్లా ప్రతినిధులు గాడి సూర్యకళ సురేందర్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పోల శ్రీనివాసులు, కార్యదర్శి కె.పీ. ప్రసాద్, బిజినపల్లి మండల అధ్యక్షుడు బి. నాగిరెడ్డి, తాడూరు మండల అధ్యక్షుడు శ్రీనివాసాచారి, ఏపీఓ సత్యం, ఆయా మండలాల ఎంఈఓలు, ఎంపీడీవోలు, ఎంఆర్ఓలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.