ముద్ర, తాండూర్:
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని సాయిపూర్లో అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో గ్యాస్ ప్రమాదాలు నివారించడానికి కై తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ఇందుర్ రాములు, బీజేవైఎం నాయకులు తాండ్ర నరేష్, మరియు అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ సిబ్బంది సాయిపూర్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.