ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికపై అవగాహన కార్యక్రమాలు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, సిఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి
ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాల సందర్భంగా ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కడ్తాల మండలం ఎం.బి.ఏ గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఆయన, అనంతరం ఆమనగల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ గార్డెన్స్‌లో జరిగిన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో ప్రగతి ప్రణాళికకు సంబంధించిన ముఖ్య అంశాలను ప్రజలకు వివరించారు.
అనంతరం కడ్తాల మండలానికి చెందిన 36 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అలాగే రావిచేడు ప్రాంతానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్‌ఎఫ్) చెక్కులను అందజేశారు.
ఈ కార్యక్రమాల్లో మండల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.