బోడుప్పల్, ముద్ర విలేకరి: శ్రావణ మాసం నాలుగో శుక్రవారం సందర్భంగా బోడుప్పల్ పెంటారెడ్డి కాలనీలో కొలువైవున్న మాతా నిమిషాంబికా దేవికి ప్రత్యేక మిఠాయి నైవేద్యాలు నివేదన చేశారు. చెప్పన్ భోగి పేరుతో మొత్తం 56 రకాల మిఠాయిలను అమ్మవారికి నివేదించారు. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే తల్లిగా… ధ్యానిస్తే ధనధాన్య వృద్ధిని, మనస్ఫూర్తిగా స్మరిస్తే ఐశ్వర్య సిద్ధిని కల్పించే మహాలక్ష్మిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. శుక్రవారం సందర్భంగా వేలాదిగా మహిళలు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలగకుండా రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచర్ల శ్రీనివాసరావు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.