ముద్ర,తెలంగాణ బ్యూరో :-పసుపు బోర్డు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న బిజెపి ప్రభుత్వం బడ్జెట్ లో ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం పట్ల ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.పసుపు బోర్డు తరహాలోనే పనిచేసే స్పైసెస్ బోర్డు, టీ బోర్డు, కాఫీ బోర్డు, రబ్బర్ బోర్డులకు నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు కు మాత్రం ఒక రూపాయి కూడా కేటాయించలేదని తెలిపారు.పసుపు బోర్డుకు నిధులు కేటాయించకుండా నిజామాబాద్ రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. నిధులు లేని పసుపు బోర్డు ఎలా పనిచేస్తుందని, ఏం పరిశోధనలు చేయగలరని ప్రశ్నించారు.