Take a fresh look at your lifestyle.

బిఎన్ తిమ్మాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం…..

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి మండలంలోని బిఎన్ తిమ్మాపురం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి మాజీ ఎంపిటిసి, బీసీ సంఘం మండల అధ్యక్షుడు జిన్నా మల్లేష్ కళ్యాణానికి సంబంధించిన పట్టు వస్త్రాలను, తలంబ్రాలు, పూలు ఆలయ పూజారులకు అందజేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు రామకృష్ణనంద స్వామి, మాజీ సర్పంచ్ రావుల నందు, వల్లందాస్ గండయ్య, నల్లమాస జంగిర్, జిన్న నర్సింహా, కృష్ణ స్వామి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.