Take a fresh look at your lifestyle.

అన్నవరం సత్యదేవుడి దర్శనానికి బయలుదేరిన యాత్రికులు

  • బస్సును ప్రారంభించిన డిపో మేనేజర్ నాగభూషణం.

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: గోదావరిఖని ఆర్టీసీ డిపో నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనిఅన్నవరం, సింహాచలం, భీమేశ్వరం,విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి ఆదివారం సాయంత్రం మూడున్నర గంటలకు ప్రత్యేక లగ్జరీ బస్సు ద్వారా యాత్రికులు భక్తులు బయలుదేరారు.డిపో మేనేజర్ నాగభూషణం జండా ఊపి బస్సు ను ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు భక్తులు యాత్రికుల సౌకర్యార్థం ప్రత్యేక రౌండ్ ట్రిప్ బస్సు సౌకర్యం కల్పించాలని సంకల్పించామని ఇప్పటికే నాలుగు ప్రత్యేక బస్సులు ద్వారా అరుణాచలం,బీదర్ తదితర ఏరియాలలో ప్రత్యేకఆలయాలలో దర్శనాలకు భక్తులు తరలి వెళ్లారని శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని మొదటి సోమవారం అన్నవరంలో ప్రత్యేక పూజలు,దర్శనార్థం 3500 రూపాయలతో ప్రత్యేక రౌండ్ ట్రిప్ యాత్ర బస్సు ప్రారంభించామని భవిష్యత్తులో కూడా మరిన్ని ప్రత్యేక దర్శన స్థలాలు యాత్రా స్థలాలకు బస్సులు ఏర్పాటు చేస్తామని ప్రజలు భక్తులు యాత్రికులు యాత్రల వివరాలకు 7013504982 నంబర్ లో సంప్రదించాలని,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిఎం కోరారు.ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ తో పాటు ట్రాఫిక్ అసిస్టెంట్ మేనేజర్ గీతాకృష్ణ, సూపరిండెంట్ అమృత తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.