Take a fresh look at your lifestyle.

బీసీ డిక్లరేషన్ కాదు.. ముమ్మాటికీ ముస్లిం డిక్లరేషన్

  • బీసీ ముసుగులో ముస్లింలకు 100 శాతం రిజర్వేషన్లకు కుట్ర.
  • 5 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించి.. ముస్లింలకు 10 శాతం అమలు చేస్తారా?
  • తెలంగాణలో హిందువులను మైనారిటీలుగా చేసే కుట్ర.
  • ఆ విష వృక్షాన్ని అడ్డుకోకుంటే దేశమంతా విస్తరించే ప్రమాదం.
  • బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తేనే మద్దతిస్తాం.
  • లేకుంటే ముస్లిం రిజర్వేషన్లను బీసీ జాబితానుండి తొలగించేదాకా పోరాడుతాం.
  • రాహుల్ తల్లి క్రిస్టియన్, తాత ముస్లిం నుండి వేరుపడ్డ పార్శీ మతస్తుడు.
  • అందుకే హిందుత్వను ధ్వంసం చేస్తామని విషం కక్కుతున్నాడు.
  • కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్ నూతన భవనాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.
  • రూ.23.75 కోట్ల కేంద్ర నిధులతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ యూనిట్.
  • వైద్య, విద్యా రంగాలకు మోదీ అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది.
  • యూపీఏ తో పోలిస్తే మూడు రెట్ల నిధులు అధికంగా వైద్య రంగానికి కేటాయించిన మోదీ.
  • బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి కూల్చివేత దుర్మార్గం.
  • జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల కోసమే పెద్దమ్మ గుడి కూల్చివేత.
  • 30 శాతం ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది.
  • తక్షణమే బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలి.
  • లేనిపక్షంలో హిందువుల దమ్మేందో చూపిస్తాం.
  • బీజేపీలో బీఆర్ఎస్ చేరికపై సీఎం రమేశ్ చెప్పింది నిజమే.
  • అది తప్పని నిరూపించే దమ్ము కేటీఆర్ కు ఉందా?
  • సీఎం రమేశ్ ను రప్పించి వేదిక ఏర్పాటు చేయిస్తా.
  • డేట్, టైం ఫిక్స్ చేసి చర్చకు రావాలని కేటీఆర్ కు సవాల్ విసురుతున్నా.
  • కుటుంబ, వారసత్వ పార్టీలకు బీజేపీ దూరం.
  • ప్రధాని మోదీ కూడా నిజామాబాద్ సభల ఇదే చెప్పారు.
  • అవినీతి, కుటుంబ పార్టీ అయిన బీఆర్ఎస్ ను విలీనం చేసుకునే ప్రసక్తే లేదు.
  • రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయింది.
  • బీఆర్ఎస్ ను నడపలేక కేసీఆర్ చేతులెత్తేశారు.
  • ఆ పార్టీ పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకుపోయింది.
  • ఆ ఆక్రోశంతోనే కేటీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.
  • సీఎంను హౌలే అంటూ తిడుతున్నా స్పందించలేని దద్దమ్మలు కాంగ్రెస్ నేతలు.
  • సోషల్ మీడియా ద్వారా మోదీసహా బీజేపీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారు.
  • ఖబడ్దార్ కేటీఆర్.. ఇకపై దుష్ప్రచారం చేస్తే అంతు చూస్తాం.
  • మా కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకుంటారు.
  • కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు.

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం డిక్లరేషన్ బిల్లును తీసుకొచ్చిందని అన్నారు. ‘‘రాష్ట్రంలో 27 శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలవుతున్నాయని, అదనంగా బీసీలకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఆ ముసుగులో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. అంటే తెలంగాణలోవంద శాతం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించబోతున్నారు. అట్లాంటప్పుడు అది బీసీ డిక్లరేషన్ ఎట్లా అవుతుంది? అది ముమ్మాటికీ ముస్లిం డిక్లరేషనే’’అని స్పష్టం చేశారు. తెలంగాణలో హిందువులను మైనారిటీలుగా చేసే కుట్ర జరుగుతోందన్నారు. ఈ ముస్లిం డిక్లరేషన్ అనే విష వ్రుక్షాన్ని అడ్డుకోకపోతే దేశమంతా విస్తరించే ప్రమాదం ఉందన్నారు. బీసీ జాబితా నుండి ముస్లింలను తొలగించేదాకా ఆ బిల్లును అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. ముస్లింలను తొలగించి 42 శాతం రిజర్వేషన్లను పూర్తిగా బీసీలకు అమలు చేస్తేనే సంపూర్ణ మద్దతిచ్చి బిల్లు ఆమోదానికి కేంద్రాన్ని ఒప్పిస్తామని చెప్పారు. కవితపై కేసులు ఎత్తేస్తే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తామంటూ సీఎం రమేశ్ ఎదుట కేటీఆర్ చేసిన ప్రతిపాదన ముమ్మాటికీ వాస్తవమేనన్నారు. అది తప్పని చెబుతున్న కేటీఆర్ కు బండి సవాల్ విసిరారు. ‘‘నేనే వేదిక ఏర్పాటు చేసి సీఎం రమేశ్ ను తీసుకొస్తా. డేట్, టైం ఫిక్స్ చేయ్. దమ్ముంటే చర్చకు రా. ఎవరిది తప్పో తేలుద్దాం’’అని సవాల్ విసిరారు. ఈరోజు కరీంనగర్ లో జిల్లా ప్రధాని ఆసుపత్రిలో కేంద్ర నిధులతో నిర్మించిన ‘క్రిటికల్ కేర్ బ్లాక్’ భవనాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఆ భవనమంతా కలియ తిరిగి ఏర్పాట్లు పరిశీలించారు. అధికారులతో సమావేశమై మౌలిక సదుపాయల కల్పన, సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ

  • క్రిటికల్ కేర్ బ్లాక్’ నిధులన్నీ కేంద్రానివే.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్య, వైద్యా రంగాలకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నారు. అందులో భాగంగానే కరీంనగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM ABHIM – Ayushman Bharat Health Infrastructure Mission) కింద రూ.23 కోట్ల 75 లక్షల కేంద్ర నిధులతో ‘క్రిటికల్ కేర్ బ్లాక్’ నూతన భవనాన్ని నిర్మించాం. మౌలిక సదుపాయాలు కల్పించాం. ఈ భవనాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం.

  • డాక్టర్లు, సిబ్బంది నియామకం, సేవలందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.

ఇకపై ఈ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది నియామకం, మెయింటెన్స్ అంతా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది. వాటిని వెంటనే సమకూర్చి క్రిటికల్ కేర్ బ్లాక్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నా. లేకుంటే ఇంత చేసి వ్రుధా అయ్యే ప్రమాదముంది. దురద్రుష్టమేమిటంటే రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు విడుదల కాకపోవడంతో ఆసుపత్రుల్లో చాలా సేవలు మూలన పడ్డాయి. ఇకపై అట్లా చేయకుండా సకాలంలో నిధులు విడుదల చేసి సేవలకు అంతరాయం లేకుండా చూడాలని కోరుతున్నా.

  • విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న మోదీ.

ఎందుకంటే విద్య, వైద్యం చాలా ముఖ్యం. అందుకే మోదీ ప్రభుత్వం ఈ రంగాలకు అత్యంత ప్రాముఖ్యనిస్తోంది. యూపీఏ హయాంలో (2014 15 బడ్జెట్‌లో) విద్యా రంగానికి కేంద్రం 68 వేల 728 కోట్లు మాత్రమే కేటాయిస్తే… ఈ ఒక్క ఏడాదే(2025 26) 1 లక్షా 28 వేల 650 కోట్ల రూపాయలు కేటాయించింది. అంటే దాదాపు విద్యా బడ్జెట్ ను డబుల్ చేశారు. ఇక వైద్య రంగం విషయానికొస్తే UPA యుగంలో 2013 14లో (మాన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం చివరి సంవత్సరం) కేంద్ర ఆరోగ్య బడ్జెట్ 37 వేల కోట్ల రూపాయలు మాత్రమే. కానీ మోదీ ప్రభుత్వం ఈ బడ్జెట్ లో (2025 26) వైద్య రంగానికి కేటాయించిన బడ్జెట్ ఎంతో తెలుసా? 1 లక్షా 35 వేల కోట్ల రూపాయలు. అంటే దాదాపు 1 లక్ష కోట్లు పెరిగింది. ఈ ఒక్కటి చాలు.. మోదీ ప్రభుత్వానికి పేదలపట్ల, వారి ఆరోగ్యంపట్ల ఎంత శ్రద్ధ ఉంది అనేదానికంటే ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? మోదీ వచ్చాక ఆయుష్మాన్ భారత్ వంటి విప్లవాత్మకమైన పథకాలు తీసుకొచ్చాక ప్రజలపై భారం చాలా తగ్గింది. నూటికి 39 రూపాయల 40 పైసలు మాత్రమే భారం పడుతోంది. ఆయుష్మాన్ భారత్ కార్డులున్న వారికైతే 5 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందుతోంది.వైద్య రంగంలో తీసుకువచ్చిన అభివృద్ధి, విప్లవాత్మక మార్పులు కూడా చాలా ఉన్నాయి. గత 11 ఏళ్లలో AIIMS (ఆలిండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) సంఖ్య 30కి పెరిగాయి. యూపీఏ పాలన నాటికి దేశవ్యాప్తంగా 7 మాత్రమే ఉండేవి. మోదీ పాలనలో 30కి పెరిగాయి. అంటే మోదీ వచ్చాక 23 ఎయిమ్స్ ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. అట్లాగే 2014 లో 387 ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లు మాత్రమే ఉంటే.. నేడు వాటిని రెట్టింపు (780) చేశారు. MBBS సీట్లు గతంలో 51 వేలు మాత్రమే ఉండేవి. మోదీ వచ్చాక మెడికల్ సీట్ల సంఖ్యను 1 లక్షా 18 వేలకు పెంచారు. గతంలో 31 వేల PG సీట్లు మాత్రమే ఉంటే నేడు 74 వేలకుపైగా సీట్లు అందుబాటులోకి తీసుకొచ్చారు.

  • జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో ముస్లిం ఓట్ల కోసమే పెద్దమ్మ గుడి కూల్చివేత.

ఇంకో విషయం ఏమిటంటే.. ప్రతి ఏటా బోనాల పండుగను నిర్వహించుకునే బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిని అధికారులు కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. హిందువులంటే అంత చులకనా? తక్షణమే అధికారులను సస్పెండ్ చేయాలి. నేనడుగుతున్నా.. వేరే మతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాలను, మసీదులను కూల్చే దమ్ముందా? రోడ్డుకు అడ్డంగా ఎన్నో ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదు. ఆ పనిచేయకుండా నిత్యం పూజలందుకునే బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిని ఎందుకు కూల్చివేశారు? త్వరలో జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఆ నియోజకవర్గంలో 30 శాతం ఓట్లున్న ఒక వర్గం వారిని సంత్రుప్తి పరిచేందుకు పెద్దమ్మ గుడిని కూల్చినట్లు అర్ధమవుతోంది. ఖబడ్దార్.. ఇది మంచి పద్దతి కాదు. రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో హిందువుల దమ్మేందో చూపిస్తాం. 80 శాతం హిందూ ఓట్లను ఏకం చేస్తాం.

  • కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కాదు.. ముమ్మాటికీ ముస్లిం డిక్లరేషన్.

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించారు. కానీ తీరా చూస్తే 32 శాతం మాత్రమే బీసీలకు, మిగిలిన 10 శాతం ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే 27 శాతం రిజర్వేషన్లు బీసీలకు అందుతున్నాయి. అంటే బీసీలకు అదనంగా ఇచ్చే రిజర్వేషన్లు 5 శాతమైతే, ఆ ముసుగులో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు సిద్ధమయ్యరు. అసలు దీనిని బీసీ డిక్లరేషన్ ఎట్లా అంటారు? ఇది ముమ్మాటికీ ముస్లిం డిక్లరేషన్ మాత్రమే.

  • బీసీ సంఘాలకు సిగ్గు లేదా?

బీసీ రిజర్వేషన్లకు వంతపాడుతున్న బీసీ సంఘాల నేతలకు సిగ్గు లేదా? బీసీలకు అన్యాయం చేస్తుంటే ఏం చేస్తున్నారు? ఒక ప్లాన్ ప్రకారం తెలంగాణలో మెజారిటీ హిందువులను మైనారిటీలుగా చేసే కుట్ర చేస్తున్నారు. ఎందుకంటే ముస్లింలకు 100 శాతం రిజర్వేషన్లను అమలు చేసి.. హిందువులను మైనారిటీలుగా చేసే కుట్రకు కాంగ్రెస్ పాల్పడుతోంది.ఈ విషయంలో మా లైన్ క్లియర్ గా ఉంది. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మత రిజర్వేషన్లకు విరుద్ధం. మొదటి నుండి ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూనే ఉన్నాం. ఇకనైనా బీసీలకే 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తేనే మద్దతిస్తాం. లేనిపక్షంలో తప్పనిసరిగా ఈ బిల్లను అడ్డుకుని తీరుతాం. ఇట్లాంటి విష వ్రుక్షాన్ని తెలంగాణలో అడ్డుకోకపోతే ఈ విష వ్రుక్షం దేశమంతా విస్తరించే ప్రమాదముంది. తక్షణమే ముస్లిం రిజర్వేషన్లను తొలగించాలి. లేనిపక్షంలో కాంగ్రెస్ కు తగిన బుద్ది చెప్పి తీరుతాం.

  • బీసీ ముసుగులో ముస్లింలకే 100 శాతం రిజర్వేషన్లు అందించే కుట్ర.

50 శాతం రిజర్వేషన్ల గేట్లను బద్దలు కొట్టడం ద్వారా హిందుత్వాన్ని దెబ్బకొడతామంటూ మొన్న రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పత్రికల్లో చూసిన. హిందువులంటే ఎంత ద్వేషమో ఆయన మాటల్లోనే అర్ధమైతుంది. పేరుకేమో 42 శాతం బీసీల రిజర్వేషన్లు.. వాటిని దోచిపెట్టేదేమో ముస్లింలకు. దేశంలో 27 శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలైతున్నయ్. గత స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను అమలు చేసిర్రు. ఇగ కాంగ్రెసోళ్లు చేసిందేముంది? 42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకే ఇచ్చేస్తే బీసీలకు ఇచ్చేదెంత 32 శాతమే కదా? ఈ లెక్కన చూస్తే లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలు 2 శాతం టిక్కెట్లను నష్టపోతున్నట్లే కదా? బీసీలకు నష్టం చేస్తున్నందుకు తెస్తున్న రిజర్వేషన్ బిల్లుకు మద్దతివ్వాలా? రిజర్వేషన్ ఫలాలను ముస్లింలకు దోచిపెడుతున్నందుకు మద్దతివ్వాలా? ముస్లింలకు రిజర్వేషన్లు దోచిపెట్టేందుకు 50 శాతం రిజర్వేషన్ల కోటాను బద్దలు కొట్టి హిందుత్వాన్ని దెబ్బతీస్తానని రాహుల్ గాంధీ చెబుతున్నందుకు మద్దతివ్వాలా? తెలంగాణ సహా దేశ ప్రజలంతా ఆలోచించాలి. హిందువులంతా ఆలోచించాలని కోరుతున్నా.రాహుల్ గాంధీ హిందుత్వ గురించి ఇంతకంటే ఏం మాట్లాడతారులే.. ఎందుకంటే ఆయన తల్లి క్రిస్టియన్. తాత ముస్లింల నుండి వేరుపడ్డ పార్శీ. ఇగ రాహుల్ ది ఏ మతమో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈ దేశం మీద హైందవ సంస్కృతి మీద అంతలా విషాన్ని గక్కుతున్నడు. కాంగ్రెస్ ను అడ్రస్ లేకుండా చేస్తున్న ఈ దేశ ప్రజల మీద రాహుల్ కు రోజురోజుకు ద్వేషం పెరుగుతోంది. అందుకే ముస్లింలకు వంద శాతం రిజర్వేషన్లు ఇచ్చి భారతదేశంలో హిందువులనే మైనారిటీలుగా మార్చే మహా కుట్రకు తెరదీసిండు. కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ది చెప్పాలని కోరుతున్నా.

  • కాంగ్రెస్ ను ఖతం చేశారు…హిందుత్వను ధ్వంసం చేయడం నీ తరం కాదు.

ఇంకో విషయం చెప్పాలే. హిందుత్వాన్ని నాశనం చేయడం ప్రధానులుగా పనిచేసిన వాళ్ల అయ్య, నానమ్మ, తాత ముత్తాతల తరమే కాలే. బచ్చాగానివి నీతోని ఏమైతది? హిందుత్వని ఖతం చేయాలని అనుకున్న కాంగ్రెస్ పార్టీనే దేశ ప్రజలు ఖతం చేశారు. కేంద్రంలో అధికారంలోకి రాకుండా చేశారు. మొన్నటిదాకా ప్రతిపక్ష హోదా కూడా ఇయ్యలే. ఈ దేశంలోని 3 రాష్ట్రాలు మినహా ఆంధ్రా, తమిళనాడుసహా అన్ని రాష్ట్రాల ప్రజలు కాంగ్రెస్ ను తరిమి తరమికొట్టారు. అతి త్వరలో తెలంగాణ, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ లోనూ కాంగ్రెస్ జెండాను ప్రజలు పీకేయబోతున్నరు. ‘అవినీతి, కుటుంబ పార్టీ అయిన కాంగ్రెస్ ముక్త్ భారత్’ బీజేపీ లక్ష్యం. మోదీగారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా ఆ లక్ష్యం నెరవేరుతోంది. హిందుత్వను దెబ్బతీయడం సంగతి తరువాత. కాంగ్రెస్ జెండాను ఇటలీకి తరలిస్తావో.. మ్యూజియంలో భద్రంగా దాచుకుంటావో ఆలోచించుకో. బీజేపీలో రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన నాతోసహా చాలా మంది బీసీలున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బీసీ. మోదీ కేబినెట్ లో 27 మంది బీసీలున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంత మంది బీసీలున్నారు? ఎంత మంది బీసీలను ముఖ్యమంత్రులుగా చేశారో చెప్పే దమ్ముందా?

  • రాహుల్ గాంధీ.. నీది ఏ మతం? ఏ కులం?

మోదీ కన్వర్టెడ్ బీసీ అంటున్న కాంగ్రెస్ నేతలారా.. మోదీ కులం బీసీ అని కాంగ్రెస్ ప్రభుత్వమే గుర్తించి దశాబ్దాల క్రితమే చెప్పింది. పోనీ రాహుల్ గాంధీ ఏ జాతి వ్యక్తి? ఏ మతం, ఏ కులం వ్యక్తి? రాహుల్ తల్లి ఇటలీ క్రిస్టియన్. తాత ముస్లిం నుండి విడిపోయిన పార్శీ వ్యక్తి. మరి రాహుల్ ఏ మతమో చెప్పాలి.

  • బీజేపీలో బీఆర్ఎస్ చేరిక ప్రతిపాదనలపై సీఎం రమేశ్ చేసిన వ్యాఖ్యలపై.

బీఆర్ఎస్ ను నడిపే సత్తా ఆ పార్టీకి లేదు. పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకుపోయారు. అందుకే ఇట్లాంటి ప్రతిపాదనలు. సీఎం రమేశ్ చెప్పింది ముమ్మాటికీ వాస్తవం. మీకో విషయం ఏందంటే… కేటీఆర్ కు మొట్ట మొదట ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడానికి కేసీఆర్ నిరాకరించారు. ఎందుకంటే అక్కడ గెలిచే పరిస్థితి లేదు. కేకే మహేందర్ రెడ్డి గెలుస్తారని చెప్పిన కేసీఆర్ చెన్నాడి సుధాకర్ రావుకు టిక్కెట్ ఖాయం చేశారు. ఆ టైంలో ముడతల చెప్పు, రబ్బర్ చెప్పులతో సీఎం రమేశ్ వద్దకు పోతే… ఆయన ఇచ్చిన నిధులతోపాటు కేసీఆర్ ను కన్విన్స్ చేయడంవల్లే కేటీఆర్ కు టిక్కెట్ వచ్చింది. పోటీ చేసి గెలిచిండు. అట్లాంటి వ్యక్తి వేల కోట్లు ఎట్లా సంపాదించారో ప్రజలు గ్రహించాలి.

  • బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రతిపాదన నిజమే.

దీంతోపాటు బీజేపీది మొదటి నుండి సింగిల్ స్టాండ్ తోనే ఉంది. బీజేపీ కుటుంబ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం. అవినీతి పార్టీలకు బీజేపీ దూరం. మరి అయ్యా కొడుకు బిడ్డ అల్లుడుతో నడిచే కుటుంబ పార్టీ బీఆర్ఎస్. అవినీతి, అక్రమాలతో తెలంగాణను దోచుకున్న పార్టీ బీఆర్ఎస్. సంకుచిత రాజకీయాలతో ప్రజల మధ్య ద్వేషం పెంచి రాజకీయ లబ్ది పొందాలనుకునే పార్టీ బీఆర్ఎస్. అట్లాంటి పార్టీతో మేం ఎందుకు పెట్టుకుంటాం? సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీగారే గత ఎన్నికలకు ముందు నిజామాబాద్ వచ్చినప్పుడు కూడా ఇదే విషయం చెప్పారు కదా? ‘‘నా కొడుకును సీఎం చేస్తా. మీ ఆశీర్వాదం ఉండాలని కేసీఆర్ అడిగితే ‘వారసత్వ రాజకీయాలను మేం వ్యతిరేకం. వాటిని ప్రోత్సహించను.’ అని కరాఖండిగా చెప్పినట్లు మోదీగారే ప్రకటించారు కదా?

  • కేటీఆర్.. దమ్ముంటే చర్చకు రా

సీఎం రమేశ్ కూడా ఇదే చెబుతున్నడు కదా? ‘‘కవితను జైలు నుండి విడిపిస్తే విలీనం చేస్తామని కేసీఆర్ కొడుకు ప్రతిపాదిస్తే.. బీజేపీ ఒప్పుకోలేదు. అది జరగని పని. అవినీతి, కుటుంబ పార్టీ అయిన బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవడమే ఉండదు’’అని తేల్చి చెప్పారు కదా? సీఎం రమేశ్ చేసిన ఆరోపణలు అబద్దమని చెబుతున్న కేటీఆర్ ను నేను సవాల్ చేస్తున్నా. ‘‘నేను వేదికను ఏర్పాటు చేస్తా. సీఎం రమేశ్ ను తీసుకొస్తా. ఆధారాలతోసహా వివరిస్తా. డేట్, టైం ఫిక్స్ చేయ్. దమ్ముంటే చర్చకు రా.’’ అని కేటీఆర్ కు సవాల్ చేస్తున్నా.

  • అవినీతి సొమ్ముతో కేటీఆర్ కు అహం ఎక్కువైంది.

కేటీఆర్ కు అహం తగ్గలేదు. ముఖ్యమంత్రి పదవికి కనీస గౌరవం ఇవ్వాలనే సోయి లేకుండా హౌలే, వాడు, నీ బొంద అని మాట్లాడుతున్నడు. కనీస సంస్కారం లేకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నడు. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నడు. కాంగ్రెసోళ్లకు సిగ్గు లేదు. చేతకాని దద్దమ్మలు వాళ్లు. కానీ ప్రధానిని, బీజేపీ నేతలను దూషిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. మా కార్యకర్తలే నీ సంగతి చూస్తారు. అడ్డగోలుగా సంపాదించిన సొమ్ముతో బలిసి సోషల్ మీడియా ద్వారా ఇష్టానుసారం రాయిస్తూ మాపై దుష్ప్రచారం చేస్తానంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. నేను హోంశాఖ సహాయ మంత్రిని. అయినా కేటీఆర్ హద్దులు దాటిపోయి వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో దుష్ర్పచారం చేస్తున్న వాళ్లను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని పిలుపునిస్తున్నా.

  • బీజేపీ సింగిల్ గానే ఎన్నికల్లో పోటీ చేస్తుంది.

తెలంగాణలో బీజేపీ స్వతహాగా పోటీ చేయబోతోంది. ప్రజలంతా బీజేపీవైపు ఉన్నారు. అందరికీ ఇచ్చారు అధికారం. ఈసారి బీజేపీకి ఇద్దాం అవకాశం అని ప్రజలంతా భావిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల్లో కూడా బీజేపీ అత్యధిక స్థానాలు గెలవబోతోంది. ఎందుకంటే గ్రామాల్లో నిధులు ఎవరిస్తున్నారు? కేంద్రమే ఇస్తోంది కదా? మరి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఎందుకు ఓట్లు వేయాలి? ప్రజలు ఆలోచించి తీర్పు ఇవ్వాలని కోరుతున్నా అన్నారు.

Leave A Reply

Your email address will not be published.