ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
హిందూ స్వరాజ్య స్థాపకుడు, ధైర్యసాహసాల ప్రతీక అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను వికారాబాద్ మండలం, గొట్టిముక్కుల గ్రామంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సధానంద రెడ్డి, వికారాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దింటి నవీన్ కుమార్ పార్లమెంటరీ ఇన్‌చార్జ్ అమరేందర్ రెడ్డి, పెద్దింటి శ్రీకాంత్, ఛత్రపతి శివాజీ యువత నాయకులు నరేష్, యాదయ్య, సాయి బాబా, హరి గౌడ్, మోహన్, రాజు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సధానంద రెడ్డి మాట్లాడుతూ శివాజీ మహారాజ్ చూపిన ధైర్యం, స్వాభిమానం, దేశభక్తి మార్గం ప్రతి భారతీయుడికి ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు, పరిపాలనా విధానం మరియు హిందూ స్వరాజ్య స్థాపనలో చూపిన త్యాగస్ఫూర్తి యువతకు ప్రేరణగా నిలుస్తాయని తెలిపారు. శివాజీ మహారాజ్ ఆశయాల సాధన కోసం మనమందరం సంకల్పంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
గ్రామ ప్రజలు, శివాజీ యువత సభ్యులు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.