Take a fresh look at your lifestyle.

పార్కులను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్

 

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలోని పార్కులను సుందరంగా మార్చాలని నూతన మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్రెడ్డి అధికారులకు సూచించారు. మున్సిపల్ చైర్ పర్సన్ గా ప్రమాణస్వీకారం చేసిన మొదటిసారి పట్టణంలోని 28వ వార్డు శాంతినగర్ లోని పార్కును మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి మరియు వార్డ్ కౌన్సిలర్ నాగారం మల్లేశంతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్కులో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించాలని, మురుగు కాలువలను శుభ్రం చేసి వేసవిలో ప్రజలకు సేద తీర్చేందుకు హల్లాధకరమైన వాతావరణం ఉండేందుకు పార్కులో పచ్చదనం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, రోడ్లపై మురుగునీరు ప్రవహించకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ సిబ్బందిని ఆమె కోరారు. చైర్మన్ తో పాటు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, వార్డ్ కౌన్సిలర్ నాగారం మల్లేశం, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.