సమన్వయంతో పని చేయండి.. ఫలితాలు సాధించండి..
మున్సిపాలిటి ఎన్నికల్లో 15 స్థానాలకు 15స్థానాలు సాధించిన మంత్రి అడ్లూరిని ప్రత్యేకంగా అభినందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు..
ఢిల్లీ:

ముఖ్యమంత్రితో పాటు రాష్ర్ట మంత్రులు సమన్వయంతో కలిసి పని చేస్తున్న ఎన్నికల్లో చక్కటి ఫలితాలు సాధించాలని, పంచాయితీ, మున్సిపాలిటి ఎన్నికల ఫలితాలు రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సాధించాలని ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలు రాష్ర్ట మంత్రులకు సూచించారు. గురువారం ఢిల్లీలో AICC అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే నివాసంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రుల ముఖ్య సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, AICC జనరల్ సెక్రటరీ కె.సి. వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పాటు రాష్ర్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు రాష్ట్రానికి చెందిన క్యాబినెట్ మంత్రులు హాజరయ్యారు.

ఈసందర్భంగా రాష్ర్టంలో ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు, మున్సిపాల్ ఎన్నికల ఫలితాలపై చర్చించి మోజార్టీ స్థానాలు సాధించినందుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో పాటు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని ప్రత్యేకంగా అభినందించారు. స్థానిక సంస్ధల ఎన్నికలు అయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ సత్త చాటాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచించింది. రాష్ర్టంలో ఏఎన్నికలు వచ్చినా గెలుపు కాంగ్రెస్ పార్టీది కావాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు పేర్కొన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గంలో 149 పంచాయతీలను గాను 108 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధులు విజయం సాధించడంతో పాటు మున్సిపాలిటి ఎన్నికల్లో ధర్మపురి మున్సిపాలిటిలో 15స్థానాలకు గాను 15స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు విజయం సాధించినందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖార్గే గారితో పాటు రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందించారు.
మంత్రులు అందరు సమన్వయంతో పని చేస్తు ముందుకు సాగాలని స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగుతేని విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పరిపాలనకు నిదర్శనమని కాంగ్రెస్ అగ్రనేతలు పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తు వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 100శాతం సీట్ల సాధించి రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ తిరుగుతేని శక్తిగా ఎదగాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సూచించారు.