ముద్ర ప్రతినిధి, నిర్మల్:
పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి పై రైతులు అవగాహన కల్పించుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ఈ వ్యాధి నివారణ టీకాలకు సంబంధించి జిల్లాలోని రైతులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటుచేసిన ప్రచార వాహనాన్ని కలెక్టరేట్ ప్రాంగణంలో జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులందరూ తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించేలా ఈ ప్రచార రథం ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని వివరించారు. జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా, రైతులు విధిగా తమ పశువులకు టీకాలను వేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, పశువైద్య అధికారి బాలిగ్ అహ్మద్, వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, హార్టికల్చర్ అధికారి రమణ, డిపిఆర్ఓ విష్ణువర్ధన్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.