ముద్ర,మల్కాజ్‌గిరి:
మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సఫిల్‌గూడ రైల్వే స్టేషన్ సమీపంలో కొనసాగుతున్న ఎల్‌హెచ్‌ఎస్ నిర్మాణ పనులను స్థానిక నాయకులు, కాలనీవాసులతో కలిసి ఆదివారం పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యతతో పాటు వేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మేకల రాము యాదవ్, హేమంత్ పటేల్, స్థానిక కాలనీవాసులు ఇతర నాయకులు పాల్గొన్నారు.