ముద్ర, తాండూర్ ప్రతినిధి :
వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం లోని పెద్దెముల్ మండలం రుక్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో గత పది రోజులుగా కూలి పనులు చేసుకుంటూ నివసిస్తున్న నలుగురుఅనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ప్రాథమిక సమాచారం. ఈ మేరకు మహారాష్ట్ర, చత్తీస్ గాడ్ రాష్ట్రాలకు చెందిన నక్సలైట్లలో ముగ్గురు పురుషులు ఒకరు మహిళా మావోయిస్టు ఉన్నారు. గత కొన్ని రోజులుగా వీరు పోలీసుల నుండి తప్పించుకొని తిరుగుతున్నట్లు సమాచారం. వీరి పైన ఇప్పటికే మహారాష్ట్రలో కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు గత పది రోజులుగా ఇ నలుగురు మావోయిస్టులు రుక్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో కూలి పనులు చేసుకుంటూ తలదాచుకుంటున్నట్లు ప్రాథమిక సమాచారం. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులు తాండూర్ పోలీస్ శాఖకు సమాచారం అందించి వారి సమన్వయంతో ఆదివారం తెల్లవారుజామున రైల్వే స్టేషన్ సమీపంలో పాతబడిన హెడ్ క్వార్టర్స్ లో చాకచక్యంగా దాడులు నిర్వహించిమావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు త్వరితగతిన మావోయిస్టులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన తాండూర్ పోలీస్ బృందానికి రాష్ట్ర పోలీస్ శాఖ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.