ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధి 6వ వార్డులో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, టౌన్ ప్రెసిడెంట్ జక్కా రాజు, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ రెడ్డి, కౌన్సిలర్లు నిజాం, ఆసిఫా బేగం ఖాదర్, శ్రీనివాసులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.