ముద్ర, కరీంనగర్ :
మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా కాంగ్రెస్ ఎస్‌సి సెల్ అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, కాంగ్రెస్ నాయకుడు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ రెడ్డి తదితరులతో కలిసి బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నగరంలోని మంచిర్యాల చౌరస్తాలో ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహానికి కూడా పూలమాలలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, దళిత సామాజిక వర్గంలో జన్మించి, కష్టపడి ఉన్నత విద్యను అభ్యసించి దేశ రాజకీయాల్లో కీలక స్థానాన్ని సంపాదించిన మహానేత బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. కేంద్రంలో దాదాపు మూడు దశాబ్దాల పాటు రక్షణ, వ్యవసాయ శాఖల మంత్రిగా పనిచేసి దేశాభివృద్ధికి విశేష సేవలు అందించారని గుర్తుచేశారు. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ దేశానికి అంకితభావంతో సేవలు చేసిన ఆయన నిర్ణయాలు, చర్యలు ఇప్పటికీ అట్టడుగు వర్గాల ప్రజలకు మార్గదర్శకంగా నిలిచాయని పేర్కొన్నారు.
అలాగే ఆయన కుమార్తె మీరా కుమార్ కూడా ప్రజాసేవలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారని, సమాజంలోని వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని తెలిపారు. బాబు జగ్జీవన్ రామ్ సేవలను స్మరించుకుంటూ ఆయనకు మరోసారి ఘన నివాళులు అర్పిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, నరేందర్ రెడ్డి, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, కర్ర రాజశేఖర్, ఎండి తాజ్, మడుపు మోహన్, పులి ఆంజనేయులు గౌడ్, మల్లికార్జున రాజేందర్, కర్ర సత్య ప్రసన్న రెడ్డి, బానోతు శ్రావణ్ నాయక్, ఎక్కురం సికిందర్, వెన్నం రజిత రెడ్డి, పర్వత మల్లేశం, వరాల నరసింగం, వెల్కపల్లి లచ్చయ్య, కామ్ రెడ్డి రామ్ రెడ్డి, వంగల విద్యాసాగర్, జీడి రమేష్, సలీముద్దీన్, మాదాసు శ్రీనివాస్, నెల్లి నరేష్, స్వప్నశ్రీ, ఊకంటి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.