ముద్ర, తెలంగాణ బ్యూరో : పది జిల్లాలకు ఇన్‌చార్జ్ మంత్రులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఆయా జిల్లాలలో ప్రజాపాలనలో భాగంగా అమలవుతోన్న వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను ఇన్‌ఛార్జ్ మంత్రులు పర్యవేక్షిస్తారు. మహబూబ్ నగర్ జిల్లా ఇన్ చార్జ్ మంత్రిగా దామోదర రాజనర్సింహా, రంగారెడ్డి జిల్లా ఇన్ చార్జ్ మంత్రిగా దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, వరంగల్ జిల్లా ఇన్ చార్జ్ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా ఇన్ చార్జ్ మంత్రిగా పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ జిల్లా ఇన్ చార్జ్ మంత్రిగా డి. అనసూయ సీతక్క, కరీంనగర్ జిల్లా ఇన్ చార్జ్ మంత్రిగా తుమ్మల నాగేశ్వర రావు, అదిలాబాద్ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా జూపల్లి కృష్ణారావు, మెదక్ జిల్లా ఇన్ చార్జ్ మంత్రిగా వివేక్ వెంకటస్వామి, నల్గొండ జిల్లా ఇన్ చార్జ్ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ఖమ్మం జిల్లా ఇన్ చార్జ్ మంత్రిగా వాకిట శ్రీహరి నియమితులయ్యారు.