Take a fresh look at your lifestyle.

కూరగాయల సాగు విస్తీర్ణం పెంచాలి కలెక్టర్ అభిలాష అభినవ్

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
జిల్లాలో రైతులు కూరగాయల సాగు విస్తీర్ణం పెంచాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. జిల్లా లోని పలువురు రైతులకు, ఉచిత ఐదు రకాల కూరగాయల విత్తనాలు కిట్లను అందించారు. ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కూరగాయల సాగును పెంచేలా కృషి చేయాలన్నారు. ఈ విత్తనాల ద్వారా నాణ్యమైన కూరగాయలు ఉత్పత్తి అవుతాయన్నారు. రైతులందరూ ఈ విత్తనాలను సాగు చేసేలా దృష్టి సారించాలని సూచించారు. ఈ విత్తనాలు అర ఎకరంలో సాగు చేయడానికి సరిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన పంటల అధికారి రమణ, ఇతర అధికారులు, సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.