కరీంనగర్ నగరపాలక సంస్థ 62 వ వార్డులో బిఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి కలకొండ జ్యోత్న ఎన్నికల ప్రచారంలో భాగంగా గంగుల కమలాకర్ పాల్గొన్నారు. స్మార్ట్ సిటీ తీసుకువచ్చిన ఘనత బిఆర్ ఎస్ పార్టీ దేనిని అన్నారు. స్మార్ట్ సిటీ తీసుకువచ్చిన అని చెప్పుకునే బిజేపి ఎంపీ బండి సంజయ్. గతంలో బిజేపి ఉన్న డివిజన్ లలో ఎందుకు రోడ్లను వేసుకోలేదని ప్రశ్నించారు.రెండున్నర సంవత్సరాలలో రెండు రూపాయల బిల్ల కేంద్రం నుంచి తీసుకువచ్చిన జీవో చూపించినా ముల్లేమూట సర్దుకుని పోతా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సవాల్ విసిరారు.2016 లో బిఆర్ ఎస్ పార్టీ వొత్తిడి మేరకు స్మార్ట్ సిటీ తీసుకువచ్చినం. 2016 నుండి 2019 వరకు నగర రోడ్లన్నీ అభివృద్ధి చేశామని తెలిపారు. సంజయ్ ఎంపీ గా గెలవాలంటే ముందే నగరాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిధులతో అభివృద్ధి చేశామని. రెండున్నర సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం నిధులతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం కంప్లీట్ చేసిన ఘనత బిఆర్ ఎస్ పార్టీ దేనిని అన్నారు. నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఆర్వోఆర్ ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం 30 డివిజన్ కు చేరుకున్న ఎమ్మెల్యే గంగుల డివిజన్ అభ్యర్థి నక్క పద్మ – కృష్ణతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాలలో ఎమ్మెల్యే గంగులతో పాటు.. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ఆయా డివిజన్లో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
