Take a fresh look at your lifestyle.

కౌంటింగ్ సెంటర్ పరిశీలన

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో భువనగిరి మండలంలో దివ్య బాల స్కూల్ లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్ ను జిల్లాఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు, ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ హాల్స్ ఏర్పాట్లు, టేబుల్స్ ఏర్పాటు, కౌంటింగ్ సిబ్బంది ఏర్పాట్లు, భద్రతా చర్యలు, సీసీటీవీ పర్యవేక్షణ, త్రాగునీరు, మరుగుదొడ్లు సదుపాయాలు, విద్యుత్ సరఫరా ఇతర మౌలిక వసతులను పరిశీలించారు.కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, చట్టబద్ధంగా ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామలింగం సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.