ముద్ర ,మోత్కూర్:
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకొని దౌర్జన్యానికి పాల్పడటం పిరికిపందుల చర్యమని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొన్నెబొయిన రమేష్ అన్నారు. శనివారం ఆయన మోత్కూర్ లో విలేకరులతో మాట్లాడుతూ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించి ప్రజల గుండెల్లో నిలిచిన కేసీఆర్ క్యాంపు ఆఫీస్ పై అల్లరి మూకలు దాడి చేయడం రాజ్యాంగ విరుద్ధమని అల్లరిముఖల పై చట్టరీత్యా చర్య తీసుకోనీ వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. కెసిఆర్ క్యాంప్ ఆఫీస్ పై దాడి అంటే తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజానీకంపై దాడి చేసినట్టేనని ఆయన అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు.