ముద్ర నడిగూడెం…
కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా నడిగూడెం మండలాన్ని ప్రత్యేక నియోజకవర్గంగా ప్రకటించాలని విద్యార్థి నాయకుడు బెల్లంకొండ నవీన్ డిమాండ్ చేశాడు. ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ— కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డీలిమిటేషన్ విధానం శుభపరిణామం అని పేర్కొన్నారు.అదేవిధంగా, చారిత్రక ప్రాధాన్యత కలిగిన నడిగూడెం కోటకు సరైన గుర్తింపు లభించకపోవడం బాధాకరమని తెలిపారు. ఆనాటి నడిగూడెం రాజా నాయని వెంకట రంగారావు ఆస్థానంలో పనిచేసిన పింగళి వెంకయ్య భారత జాతీయ కాంగ్రెస్ సభలో నడిగూడెం కోట నుంచే జాతీయ జెండా రూపకల్పన చేసి సమర్పించిన విషయం గర్వకారణమని గుర్తుచేశారు. అనంతరం ఆ జెండాలో కొన్ని మార్పులు చేర్పులు చేసి మన జాతీయ జెండాగా రూపుదిద్దుకుంది.ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న నడిగూడెం మండలానికి ఇప్పటివరకు తగిన ప్రాధాన్యత దక్కకపోవడం విచారకరమని అన్నారు.ఈ నేపథ్యంలో నడిగూడెం మండలాన్ని నియోజకవర్గంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, మండలంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు తన డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.
నడిగూడెం మండలాన్ని నియోజకవర్గంగా ప్రకటిస్తే, భారతదేశానికి జాతీయ జెండా అందించిన ఈ ప్రాంతానికి తగిన గుర్తింపు, ప్రాధాన్యత లభిస్తుందని అన్నారు