ముద్ర గండిపేట్ విలేకరి : రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను సమాన దృష్టితో అభివృద్ది చేయడం జరుగుతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు.బుధవారం నార్సింగి మున్సిపాలిటీలోని ఖానాపూర్‌లో కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తో కలిసి హాజరయ్యారు.నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో రూ.2.93 కోట్లతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ భవనంను కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తున్నట్లు వివరించారు. అన్ని మున్సిపాలిటీలకు నిధులు రప్పించి మున్సిపాలిటీలను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నార్సింగి మున్సిపాలిటీ కమిషనర్ టి కృష్ణమోహన్ రెడ్డి, టిపిసిసి అధికార ప్రతినిధి ముంగి జైపాల్ రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్, నార్సింగి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అశోక్ యాదవ్, నార్సింగి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వేణు గౌడ్, పాక్స్ చైర్మెన్ తోలుకట్ట కృష్ణ, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మన్నే గండయ్య ముదిరాజ్, మాజీ సర్పంచులు రామేశ్వరం నరసింహ, మేకల ప్రవీణ్, అశోక్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పెద్దపులి కిషన్, మాజీ కౌన్సిలర్లు అమరేందర్ రెడ్డి, ఉషారాణి, పత్తి ప్రవీణ్, నరేష్, దుర్గేష్ యాదవ్, వెంకటేష్ యాదవ్, నార్సింగి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, లక్ష్మీ శ్రీ, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
