Take a fresh look at your lifestyle.

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్:
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు.
బుధవారం చిల్డ్రన్స్ రోడ్ సేఫ్టీ డే సందర్భంగా మెదక్ మండలంలోని మక్త భూపతిపూర్ లో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాలుగు సంవత్సరాలు పైబడిన వయసు కలిగిన పిల్లలు సైతం వాహనాల మీద తీసుకెళ్లేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పక ధరించాలని అన్నారు. మైనర్లు డ్రంక్ అండ్, డ్రైవ్ ఓవర్ స్పీడ్ జోలికి పోవద్దన్నారు. ట్రాఫిక్ నిబంధనల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.