ప్రజా ప్రతినిధుల, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా సోషల్ మీడియాలో కంటెంట్ పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి… ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో పట్టణ సీఐ కి ఫిర్యాదు
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని వారికి పరువు నష్టం కలిగే విధంగా అనుచిత వ్యాఖ్యలు, బెదిరించే విధంగా సోషల్ మీడియాలో కంటెంట్ పెడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతు ముదిరాజ్ మహాసభ నాయకులు మంగళవారం భువనగిరి పట్టణ సీఐ రమేష్ కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా మహాసభ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొలుపుల హరినాథ్, సాదు విజయ్ కుమార్ లు మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా కోనేటిపూర్ గ్రామానికి చెందిన నూకం జాన్ ముదిరాజ్, వనపర్తి జిల్లా మనుగిల్ల గ్రామానికి చెందిన వై. శివ ముదిరాజ్, అల్లదుర్గం సురేష్ లు ప్రముఖ ప్రజా ప్రతినిధులైన ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, ఎంపి ఈటెల రాజేందర్, మంత్రి వాకిటి శ్రీహరిల పై సోషల్ మీడియా వేదికగా ఉద్దేశపూర్వకంగా విపరీతమైన దుర్భషలాడుతు, అసహ్యమైన భాషతో బెదిరించే విధంగా కంటెంట్ తయారు చేసి పెడుతున్నారని ఆరోపించారు. వీరు తయారు చేసే కంటెంట్ ప్రముఖులపై వ్యక్తిగతంగానే కాకుండా వారి కుటుంబ సభ్యులపై కూడా అనుచితంగా ఉండే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.
నూకం జాన్ అలియాస్ నాని “జనతా న్యూస్ ఆప్”, “ముదిరాజ్ హిస్ట్రీ టివి” సి.ఈ.ఓ.గా ఉండి వీటి ద్వారా ముదిరాజ్ కమ్యూనిటి నాయకులను అత్యంత అవమానకరమైన బాషను ఉ పయోగిస్తు వారిని తిడుతు వారిని బెదిరింపులకు గురిచేస్తున్నాడని ఇతనిపై 196(1), 197(1), 299, 352, 353(1)(2), 356(2) కేసులు నమోదు చేశారని చెప్పారు. వారిపై సమగ్ర విచారణ చేసి సంబంధిత చట్టాల ప్రకారం తగిన కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెంట నర్సింహా, కన్వీనర్ ఉడుత భాస్కర్, జిల్లా నాయకులు పిట్టల బాలరాజు, కనక బాలరాజు –
బోయిని బాలయ్య. పిట్టల రాములు. ఇట్టబోయిన గోపాల్, ఎనబోయిన జహంగీర్, గీస కొండల్ పాల్గొన్నారు.